స్త్రీలు పురుషాధిక్యత ప్రపంచంలోనే బతకాల్సి వస్తోందని నటి తాప్సీ సంచలన వ్యాఖ్యలతో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ అమ్మడు ఇంతకు ముందు కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేసి తన పురుష ద్వేషాన్ని వెళ్లగక్కారన్నది గమనార్హం. తాప్సీ తత్వం చూస్తుంటే ఆమె మగవారి బాధింపునకు గురైనట్లు అనిపించక మానదు. ఈమె బహుభాషా నటి అయినా అవకాశాలు మాత్రం అంతంత మాత్రమేనని చెప్పక తప్పదు.
ముఖ్యంగా కోలీవుడ్‌లో అసలు చాన్సులు రాక పోవడం తాప్సీకి నిరాశ కలిగించే అంశమే. లారెన్స్‌తో నటించిన కాంచన-2 చిత్రం విజయం సాధించడంతో కోలీవుడ్‌లో స్థిరంగా జెండా పాతాలని ఆశించిన ఈ భామ ఊహలు పారలేదు. అదే విధంగా టాలీవుడ్‌లోనూ అవకాశాలు నిల్. ప్రస్తుతం బాలీవుడ్‌నే నమ్ముకున్న తాప్సీకి తాజాగా సీసీఎల్(సెలబ్రిటీ క్రికెట్ లీగ్)కు ప్రచారకర్తగా అవకాశం వచ్చింది. తను మాట్లాడుతూ క్రీడలంటే తనకు చిన్నప్పటి నుంచి ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఇతర క్రీడల్ని ఆసక్తిగా చూడకపోయినా క్రికెట్ క్రీడను మాత్రం మనసు పెట్టి ఆస్వాధిస్తానన్నారు. అయితే ఏ రంగంలో అయినా పురుషాధిక్యత అధికమేనని వ్యాఖ్యానించారు.
ఇందుకు క్రికెట్ క్రీడా రంగం అతీతం కాదని పేర్కొన్నారు.ముఖ్యంగా ఇండియాలో స్త్రీలు పురుషాధిక్యత ప్రపంచంలో బతకాల్సి వస్తోందన్నారు. పురుషాధిక్యత అని తెలిసినా వారితోనే కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మగవారెవరూ మహిళలకు సాయం చేయరని మనమే సాయం చేసుకోవాలని అన్నారు. ఇక తాను నటిగా పంజాబీ చిత్రాలతో పరిచయం అయినా, ఆ తరువాత తమిళం, తెలుగు భాషా చిత్రాలతో ప్రాచుర్యం పొందానని తెలిపారు.ప్రస్తుతం హిందీలో నటిస్తున్నట్లు తాప్సీ వెల్లడించారు.
Post a Comment