నూతన తారలతో తెరకెక్కుతున్న చిత్రం ఎడాల్. ది ఎక్స్‌ట్రార్డినరీ వెకన్షా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవ జంట వెంకట్, యువ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో సుందరమహాలింగం, సంపత్, శాంతి నటిస్తున్నారు.ఈ చిత్రం ద్వారా భారతీరాజా శిష్యుడు శ్రీకర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఆయన కథ, కథనం, మాటలు, పాటలు రాసి దర్శకత్వం వహిస్తున్న ఎడల్ చిత్ర వివరాలను తెలుపుతూ ఇది విభిన్న ప్రేమ కథా చిత్రం అని తెలిపారు.

 చిత్రంలో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారన్నారు.అయితే వారి ప్రేమకు పలు రకాలుగా వ్యతిరేకత వస్తుందన్నారు. వాటిని హీరో సామ, ధాన,భేద దండోపాయాలతో ఎలాఎదుర్కొన్నాడు అన్నదే ఎడల్ చిత్ర కథ అని చెప్పారు. ఇందులో మంచి స్నేహంతో పాటు బుద్ధిశాలితనం ఉంటుందని అన్నారు. దీనికి తిరునావుక్కరసు చాయాగ్రహణను,జో-స్మిత్‌ల ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. జనరంజిక అంశాలతో కూడిన ఎడల్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Post a Comment

Powered by Blogger.